పాకిస్థాన్‌ మాఫియా డాన్.. సర్ఫరాజ్ తంబా హత్య 

పాకిస్థాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ తంబా ఆదివారం హత్యకు గురైయ్యాడు. లాహోర్‌లోని ఇస్లాంపుర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని గన్ తో కాల్చి చంపారు. తంబాని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సరబ్‌జిత్‌ సింగ్‌ హత్య కేసులో నిందితులైన అమీర్‌ సర్ఫరాజ్‌ తంబా, ముదస్సర్‌ను అరెస్ట్ చేసి, నిర్దోషులుగా పాకిస్థాన్‌ కోర్టు ఆరేళ్ల క్రితం విడుదల చేసింది.  కాల్పులు జరిపారు. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు తంబా సన్నిహితుడు. 

పంజాబ్‌లోని భిఖివింద్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్ మద్యం మత్తులో పొరపాటున పాకిస్థాన్‌లోకి ప్రవేశించాడు. గూఢచర్యానికి పాల్పడినట్లు, 1990లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో అతడి ప్రాత ఉందని ఆరోపించిన పాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది. లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు 2013లో సరబ్‌జిత్ సింగ్‌పై కొందరు ఖైదీలు ఇటుకలు, ఐరాన్‌ రాడ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించాడు. జైలులో సరబ్‌జిత్‌పై దాడి చేసింది అమీర్ సర్ఫరాజ్ అని వార్తలు వచ్చాయి. అప్పుడు అరెస్ట్ చేసి 2018లో అమీర్ సర్ఫరాజ్ విడుదల చేశారు.